కంచ గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని విద్యార్థులు అనడం సరి కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విద్యార్ది , ఉపాధ్యాయులను బీజేపీ, బీఆర్ఎస్ లు రెచ్చగొట్టాయని ఆయన ఆరోపించారు. భూముల వ్యవహారం పై బీజేపీ, బిఆర్ఎస్ లు కలసి కుట్రకు తెరలేపాయని మండిపడ్డారు. సన్న బియ్యం పంపిణీ ,రాజీవ్ యువ వికాసం పై చర్చ జరగకుండా బీజేపీ, బీఆర్ఎస్ లు ఓ పెద్ద కుట్రకు తెరలేపారన్న అనుమానం కలుగుతుందన్నారు. తమను రాష్ట్ర నేతలు పట్టించుకోవడం లేదని ఫేక్ వీడియోలతో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కు ట్యాగ్ చేస్తున్నారని, ఇదంతా తప్పని అన్నారు. మొత్తంగా ప్రభుత్వాన్ని సైకలాజికల్ గా డిస్టబ్ చేయాలనేది బీజేపీ, బిఆర్ఎస్ కుట్ర పన్నాయన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అనని మాటలను అన్నట్లు గా కొన్ని పేపర్లు రాశాయని, ఊహాగానాలను వాస్తవవార్తల రూపంలో రాయడం సరైంది కాదన్నారు. కేంద్రంలో బీజేపీ ,రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కంచ గచ్చిబౌలి భూములను ఐఎంజీ కి లీజు కు ఇచ్చారని,
బీల్లీ రావుతో ఒప్పదం లేకపోతే గత పదేళ్లుగా 400 ఎకరాల భూమిపై బిఆర్ఎస్ ఎందుకు కొట్లాడలేదని నిలదీశారు. హెచ్ సీయూ స్టూడెంట్స్ కూ ఈ సమస్యపై అవగాహన లేదన్నారు. దీంతో ప్రతిపక్షాల కుట్రలో విద్యార్థులు పావుగా మారారన్నారు. కంచ గచ్చిబౌలి వివాదంపై సీఎం లేదంటే మంత్రి శ్రీధర్ బాబు ఎదైనా కామెంట్ చేస్తేనే అది ప్రభుత్వ నిర్ణయం అవుతుందన్నారు. యూనివర్సిటీ తరలింపు అనేది ఊహాగానమేనని స్పష్టం చేశారు. ప్రైవేటు కంపెనీకి కేటాయించిన భూమిని తిరిగి తీసుకుని అభివృద్ధి చేస్తామంటే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.








