Mahaa Daily Exclusive

  పేదవాడి కడుపునింపే సన్నబియ్యం పథకం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంస…!

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకంలో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో తెల్లరేషన్ కార్డ్ లబ్ధిదారుడు , దళిత వ్యక్తి , పట్ల జనార్థన్ ఇంట్లో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల విరేశం , తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సన్న బియ్యం భోజనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం పేదవాళ్లకు ఎంతో మేలు చేస్తుందన్నారు. గతంలో దొడ్డు బియ్యం తినలేక దళారులకు అమ్ముకుని ,మళ్ళీ సన్నబియ్యం కొనుక్కుని తినే పరిస్థితి ఉండేదన్నారు. గతంలో ఆ పథకం దళారులకు మాత్రమే మేలు చేసేదని ఆయన వివరించారు. పేదవాడు మూడు పూటలా కడుపునిండా అన్నం తినే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో సన్నబియ్యం పథకం ప్రారంభించడం జరిగిందని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం పేదవాళ్లకు మేలు చేసే ప్రభుత్వంగా పని చేస్తుందని ఆయన తెలిపారు. సన్నబియ్యం పథకాన్ని పక్క ప్రణాళికతో అమలు చేస్తున్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఉన్నతాధికారులను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందించారు.

ఈ కార్యక్రమంలో మదర్ డైరీ మాజీ ఛైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి , ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు , నకిరేకల్ నియోజకవర్గ నాయకులు , ఉరుమడ్ల గ్రామ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.