Mahaa Daily Exclusive

  క్రమశిక్షణ ఉల్లంఘన…? రాజాసింగ్ వ్యాఖ్యలపై అధిష్టానం ఆరా నివేదిక కోరిన బీజేపీ అధిష్టానం..!

Share

గత కొంత కాలంగాఎ రాష్ట్ర పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ హైకమాండ్ ఆరా తీయడం ప్రారంభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లక్ష్యంగా రాజాసింగ్ చేసిన కామెంట్స్ పైన అధిష్టానానికి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో, అసలు రాజాసింగ్ వ్యాఖ్యలపై నివేదిక కోరినట్లు సమాచారం. పార్టీలో నిర్ణయాలపైన, చేస్తున్న వ్యాఖ్యలపైన హైకమాండ్ ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. దీంతో, రాజాసింగ్ పైన తమ నిర్ణయం ప్రకటించేందుకు బీజేపీ నాయకత్వం సిద్దమైనట్లు సమాచారం. పార్టీ అధినాయకత్వం క్రమశిక్షణ చర్యలు ప్రకటించేందుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి నివేదిక కోరినట్లు పార్టీ నేతల సమాచారం. రాజాసింగ్ కొంత కాలంగా చేస్తున్న వ్యాఖ్యలు.. చోటు చేసుకుంటున్న పరిణామాల పైన పూర్తి నివేదిక రూపంలో పంపినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలో ఉన్న గ్రూపులు… ఎవరు సీఎంగా ఉంటే వారిని పార్టీలోకి నొందరు నేతలు రహస్యంగా కలుస్తున్నారని రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్‌రావును ప్రకటించడంపై రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కేంద్ర మంత్రి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లక్ష్యంగా రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. తాజడాగా శ్రీరామనవమి ర్యాలీ నేపథ్యంలోనూ నేరుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ గా చేసి రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యల కారణంగా పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని కొందరు నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో, రాజాసింగ్ పై పార్టీ నాయకత్వం సూచన మేరకు రాష్ట్ర నేతలు నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ సీనియర్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పదవి ఆశించారు. అయితే, పార్టీ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించారు. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న రాజాసింగ్ పార్టీలో పరిణామాలపైన ఓపెన్ గానే మండిపడుతున్నారు. దీంతో, ఇప్పుడు రాజాసింగ్ విషయం లో పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

గతంలో సస్పెన్షన్ కు గురైన రాజాసింగ్

హిందూత్వమే తన ఊపిరి అన్నట్లుగా ప్రజల్లో పేరు సంపాదించుకున్న రాజాసింగ్ గతంలోనూ బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వివాదాస్పద హాస్య నటుడితో హైదరాబాద్ లో షో నిర్వహించింది. ఈ షోకు వ్యతిరేకంగా రాజాసింగ్ చివరి వరకు పోరాటం చేశారు. ఈ సందర్భంగా యొక వర్గాన్ని ఉజద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్టానం రాజాసింగ్ ను సస్పెండ్ చేసింది. 2023 ఎన్నికలకు ముందు సస్పెన్షన్ ను తొలగించిన అధిష్టానం తిరిగి టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి రాజాసింగ్ ఒక్కరే బీజేపీ తరఫున గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత రాజాసింగ్ కొంత కాలం నాయకత్వంతో కలిసి ఉన్నప్పటికీ తదనంతర పరిణామాల నేపథ్యంలో పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు వ్యాఖ్యలు చేయడం కాషాయ దళంలో కలకలం రేకెత్తిస్తోంది.