Mahaa Daily Exclusive

  ఢిల్లీ ఏపీ భవన్‌లో తనిఖీలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల…!

Share

ఢిల్లీ ఏపీ భవన్‌లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా బియ్యం నాణ్యతను పరిశీలించిన ఆయన.. బియ్యం బస్తా తూకంలో తేడా రావడం వల్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ పేరుతో ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న దుకాణాన్ని మంత్రి సీజ్ చేశారు. దీంతో మరో నెల రోజుల్లో కొత్త ప్రభుత్వ దుకాణాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.