Mahaa Daily Exclusive

  కులగణన చేసే వరకు పోరాటం చేస్తాం: రాహుల్ గాంధీ

Share

దేశంలో కులగణణ చేసే వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కులగణనతో దేశంలో ఏ వర్గం జనాభా ఎంత ఉందో తేలుతుందన్నారు. దళితులు, ఆదివాసులు, పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణలో కులగణన చేపట్టి సీఎం రేవంత్ ఆదర్శంగా నిలిచారని, జాతీయ స్థాయిలోనూ కులగణన చేయడం అత్యవసరమని వెల్లడించారు.