Mahaa Daily Exclusive

  మోదీ గురించి మాట్లాడితే ఖబర్ధార్ రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖాన్ మాటలు బంద్ చెయ్ – బీజేఎల్ పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Share

ఏఐసీసీ ప్లినరీ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడిన తీరు మతి స్థిమితం లేని వ్యక్తి మాట్లాడినట్లుందని బీజేఎల్ పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పదవి కాపాడుకోవడానికి, రాహుల్ గాంధీ మెప్పు కొసం మాట్లాడుతున్నారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రేవంత్ వ్యాఖ్యలు బుడ్డర్ కాన్ మాటల్లాగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మీనాక్షి నటరాజన్ ఎప్పుడు సెక్రటేరియట్ లో అడుగు పెట్టారో అప్పుడే రేవంత్ అసమర్థుడని తేలిందన్నారు. సీఎం లేని సమయంలో రాజ్యంగేతర శక్తి సెక్రటరియేట్ లో రివ్యూ చేసిందని, గతంలో ఎన్నడూ లేదన్నారు. రేవంత్ రెడ్డి తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరు ఏ గడ్డ మీద మాట్లాడారో… అదే గడ్డపై మోదీ మూడు సార్లు ముఖ్యమంత్రి, ప్రధాని అయ్యాడని గుర్తుంచుకోవాలన్నారు. మతాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని, నెహ్రు ప్రధాని కావాలని దేశాన్ని ముక్కలు చేశారని మండిపడ్డారు. మతం పేరు మీద దేశాన్ని విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని ప్రజలు మరువరన్నారు. దేశ ప్రజలు గతాన్ని మర్చిపోయారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని, అందుకే గతంలో కాంగ్రెస్ ఏం చేసిందో మరిచిపోయి.. మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గతాన్ని తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. దేశ భక్తి ఉన్న పార్టీ బీజేపీ అని, దమ్ము, దైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీలు ఎగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. తెలంగాణా ప్రజలను మోసం చేసిన రాహుల్ గాంధీని, ఇక్కడి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీకి దేశ భక్తి ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు శరైన పాలన అండించానని రేవంత్ రెడ్డి బావిస్తే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. కొడంగల్ నుంచి తిరిగి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ సిద్ధాంతం ఔరంగజెబ్ సిద్ధాంతమని, ఆ పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయం హిందూ వ్యతిరేక నిర్ణయం అని అన్నారు. రాహుల్ గాంధీకీ భారతదేశం మీద ప్రేమ కంటే విదేశీ ప్రేమ ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ మోకాళ్లపై నడిచినా ఈ దేశానికి ప్రధాన మంత్రి కాలేడన్నారు.