Mahaa Daily Exclusive

  కేంద్ర పథకాలకు సీఎం రేవంత్ ఫోటో పెట్టాలి తెలంగాణ సొమ్ము లేకుండా కేంద్ర పథకాలెక్కడివి? బిజెపిపై మంత్రి తుమ్మల విసుర్లు …!

Share

రాజన్న సిరిసిల్లా జిల్లాలో టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభం అయింది. టెక్స్ పోర్ట్ యూనిట్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల‌ నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. బారతదేశంలో మొట్ట మొదటిసారిగా సిరిసిల్లలో టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభం అయింది. తెలంగాణలో మహిళలకు ఉపాధి నిమిత్తం టెక్స్ పోర్ట్ యూనిట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి, 800 మంది మహిళలకి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు . ఉద్యోగ శిక్షణనిచ్చి ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం సిరిసిల్లలోనే టెక్స్ పోర్ట్‌లో ఉద్యోగం లభించనుంది.

మేం పన్నులు కడుతున్నాం.. మా సీఎం ఫొటో పెట్టాలి

. అదేవిధంగా రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫోటో పెట్టాలని బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా స్పందించారు.. ఇది నీ అబ్బ సొత్తు కాదు.. మా అబ్బ సొత్తు కాదు.. కేంద్రానికి 70 పైసలు ఇస్తే.. 30 పైసలు ఇస్తున్నారు.. కేంద్రాన్ని కాపాడేది రాష్ట్ర ప్రభుత్వాలే అని ఫైర్ అయ్యారు. కేంద్రం నిధులిస్తుందట.. ఎవరిదో ఫోటో పెట్టాలంటా.. మేము కూడా పన్నులు కడుతున్నాము.. కేంద్ర పథకాలకు మా సీఎం ఫొటో పెట్టాలని మంత్రి తుమ్మల డిమాండ్ చేశారు.