Mahaa Daily Exclusive

  రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ నేతల రాజ్యం హెలికాప్టర్ ఎక్కాలన్నా వాళ్ళే.. కొనాలన్నా వాళ్ళే మంత్రి దామోదర రాజనర్సింహ…!

Share

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ నేతల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. హెలికాప్టర్ ఎక్కాలన్నా వాళ్లే… వాటిని కొనాలన్న వాళ్ళే అని మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అంటూ నాలుగు హెలికాప్టర్లు కొనాలని సెటైర్లు వేశారు. అంతేకాదు.. హైదరాబాద్ సెంట్రల్ సెక్రటేరియట్‌పై హెలిపాడ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఏది ఉన్నా.. ఏం కావాలన్నా ఉత్తర తెలంగాణ వైపే ఉన్నాయని అన్నారు. ఇప్పటివరకు సొంతంగా తాను ఒక్కసారి కూడా హెలికాప్టర్ వాడలేదని తెలిపారు.