బీజేపీ, నరేంద్ర మోడీ రాజకీయ కక్ష సాధింపు ధోరణిని నిరసిస్తూ ఈనెల 17వ తేదీన ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఈ.డి కార్యాలయం ముందు టీపీసీసీ అధ్యర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్ష పూరితంగా ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నామని, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని టీపీసీసీ పిలుపునిచ్చింది.
Post Views: 65








