Mahaa Daily Exclusive

  21న తెలంగాణ ఇంటర్ రిజల్ట్ పరీక్షలు రాసిన 9,96,971 మంది విద్యార్ధులు వాట్సాప్ ద్వారా కూడా రిజల్ట్…!

Share

తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏపీ ఫలితాలు రిలీజైన నేపథ్యంలో తెలంగాణ రిజల్ట్ పై ఒత్తిడి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. ఈసారి మూల్యాంకనంలో ప్రభుత్వం కొత్త విధానం అనుసరిస్తున్నారు. పరీక్షల ఫలితాలు విడుదలైన తరువాత ఫెయిల్ అయిన విద్యార్ధుల ప్రశ్నాపత్రాల్ని మరోసారి వెరిఫై చేయనున్నారు. అలాగే ఎక్కడా ఎలాంటి తప్పులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో మొత్తం వాల్యుయేషన్, మార్కుల డిజిటలైజేషన్ పూర్తి చేయనున్నారు. అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 21న ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. వాట్సప్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.