Mahaa Daily Exclusive

  మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మానవత్వం విమానంలో సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిన ప్రీతి…!

Share

విమానంలో సీపీఆర్ చేసి మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడారు. శనివారం అర్థరాత్రి ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా మూర్చపోయి, నోట్లో నుండి ద్రవం కారుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన 74 ఏళ్ల వృద్ధుడు
బీపీ తక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చి వెంటనే సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు డాక్టర్ ప్రీతి రెడ్డి కాపాడింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే వృద్ధుడిని ఆసుపత్రికి తరలించి ఎయిర్ పోర్ట్ సిబ్బంది చికిత్స అందించారు. డాక్టర్ ప్రీతిరెడ్డి మానవత్వాన్ని అందరూ అభినందిస్తున్నారు.