వక్ఫ్ బోర్డ్ పై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కేంద్రం సవరణ చేసిన వక్ఫ్ బోర్డ్ బిల్లును తాము సుప్రీంకోర్టు లో ఛాలెంజ్ చేసామని, రాజ్యంగం మీద ముస్లిం లకు నమ్మకం ఉందన్నారు. వక్ఫ్ బిల్లు పై తాను సుప్రీంకోర్టు లో పిర్యాదుదారుడినని, తన తరుపున కపిల్ సిబాల్ వాదించారన్నారు. కబ్జా చేసిన భూముల అన్నింటికీ ఒకటే చట్టం చేయాలని, కేవలం ఒక మతానికి మాత్రమే చట్టం చేస్తే ఎలాగంటూ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. వక్ఫ్ భూములు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కావని, దాతలు ఇచ్చిన భూములు పేద ముస్లిం లకు చెందాలని ఇచ్చారన్నారు. వక్ఫ్ బోర్డులో మహిళలకు కూడా ఇవ్వాలని ఉందని, తెలంగాణ లో,ఏపీలో మహిళలు కూడా ఉన్నారన్నారు. వక్ఫ్ భూములే కబ్జా కావట్లేదని, అన్ని మతాల దేవాలయాల భూములు కబ్జా చేస్తున్నారన్నారు
Post Views: 102








