తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి జపాన్లో ఘన స్వాగతం లభించింది. మరోవైపు.. జపాన్ వెళ్లింది మొదలు పలు సంస్థలతో రేవంత్ రెడ్డి భేటీ అవుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో.. పర్యటనకు సంబంధించిన ఫోటోలను తెలంగాణ సీఎంఓ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. కొండారెడ్డిపల్లిలో అయినా జపాన్లో అయినా మహారాజు ఎక్కడున్న మహారాజే.. అంటూ తమ తమ వ్యక్తిగత ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అభిమానులు. కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంతో ఈ పోస్టులు వైరల్ చేస్తున్నారు.
Post Views: 130








