Mahaa Daily Exclusive

  ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన లేదు ప్రజలే గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కేటీఆర్ …!

Share

:రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. గురువారం తెంలగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘‘బంగ్లా తరహాలో జనమే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారన్నారు. ఎంతో మంది నియంతలకు ప్రజలకు గుణపాఠం చెప్పారంటూ రేవంత్‌రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. మళ్లీ 20 ఏళ్ల వరకు ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయరు, ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థం కావాలన్నారు. సీఎం ఆర్థిక దోపిడీ, పర్యావరణ విధ్వంసంపై సిట్టింగ్‌ జడ్జి లేదా స్వతంత్ర దర్యాపు సంస్థతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మరొకరు సీఎం స్థానంలో ఉంటే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో రాజీనామా చేసేవారని, రేవంత్‌రెడ్డికి ధైర్యం ఉంటే భద్రత లేకుండా జనంలోకి వెళ్లాలని సవాల్ విసిరారు.

మాటల వేట సీఎందే కానీ.. సీఎస్‌, అధికారులు బలవుతున్నారన్నారు. ఐఎఎస్, అటవీ అధికారుల వంతు అయింది, ఇతర అధికారులూ జాగ్రత్తగా ఉండాలన్నారు. రేవంత్‌రెడ్డి సైన్యంలా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఇష్టానుసారం కేసులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. రేవంత్‌రెడ్డి ప్రైవేటు ముఠాలా పని చేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ఎండగట్టిందని పేర్కొన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉందా? లేదా? అనే దానిపై నెలాఖరు వరకు ఎదురుచూస్తామని, నెలాఖరులో బీఆర్ఎస్ భేటీ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్దకు వెళ్తామన్నారు. ఆధారాలతో సహా వాటికి అందజేస్తామని, అప్పటికీ స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బీజేపీని ఎండగడతామన్నారు. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని కేటీఆర్ మండిపడ్డారు. ఆర్థిక దోపిడీ, పర్యావరణంపై దాడి విషయంపై ప్రధాని స్పందించాలన్నారు. స్పందించకపోతే ఆయనకు కూడా పాపంలో వాటా ఉందని భావించాల్సి వస్తుందన్నారు. చిత్తశుద్ధి ఉంటే రేవంత్‌రెడ్డి బయటకు రావాలని ఢిమాండ్ చేశారు. ఫార్ములా ఈ రేసులో మంత్రిగా విధాన నిర్ణయాలు తీసుకున్నా అని చెప్పా, అంతేకానీ అధికారులను బలి చేయలేదని, ఫార్ములా ఈ రేసులో అభ్యంతరం ఉంటే నేను బాధ్యత తీసుకుంటా అని కేటీఆర్‌ తెలిపారు.