Mahaa Daily Exclusive

  అమిత్ షా కాదు..ఏ షా వచ్చిన మాకేం కాదు: స్టాలిన్

Share

తమిళనాడులో బీజేపీ ఇటీవల అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా వచ్చి తమిళనాడులో ఏదో చేద్దాం అనుకున్నారని, కానీ అమిత్ షా కాదు కదా.. ఏ షా వచ్చిన తమని ఏం చేయలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే దేశ ప్రజలకు తానే చెప్పేది ఒక్కటే అని, తాను చేస్తున్న  యుద్ధం కేవలం తమిళనాడు కోసం కాదని, దేశంలోని యువత కోసం అంటూ పేర్కొన్నారు.