హైదరాబాద్‌లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. GHMC అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై కూలిన చెట్లను తొలగించి, వెంటనే విద్యుత్ సరఫరా చేయాలని చెప్పారు. మరోసారి భారీ వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు రావద్దని సూచించారు.
Post Views: 94







