ఆరోగ్య సమస్యల వల్ల దుబాయ్ వెళ్లానని బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. దాని వల్లే నేతలకు, కార్యకర్తలకు దూరమయ్యానన్నారు. ఆదివారం బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన కొడుకుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయవద్దని సీపీని కోరినట్లు వెల్లడించారు.
Post Views: 87








