ఐదు కోట్ల మందిని నేరుగా టచ్ చేసింది ఒక్క వైసీపీ మాత్రమేనని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతి గడపకూ వెళ్లి సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అన్ని వర్గాలను ముందుకు నడిపించింది వైయస్ జగన్ ప్రభుత్వం అని ఆయన చెప్పారు. సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే విధంగా జగన్ పాలన కొనసాగించారన్నారు. పేదలు, ఎస్సీలు, మైనార్టీలను పేదరికం నుంచి బయటికి తీసుకురావాలని ఆకాంక్షించింది జగన్ అని చెప్పారు.
Post Views: 50








