పోప్ ఫ్రాన్సిస్ (88) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. సోమవారం ఆయన వాటికన్ సిటీలో తుది శ్వాస విడిచారు. పోప్ ఫ్రాన్సిస్ గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొద్దిరోజుల క్రితమే పోప్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో పోప్ ఫ్రాన్సిస్ తన ఆఖరి సందేశం ఇచ్చారు. స్వేచ్ఛ, సహనాలపై పిలుపునిచ్చారు. “మత స్వేచ్ఛ, ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇతరుల అభిప్రాయాలను గౌరవించకుండా శాంతి ఉండదు,” అని ఆయన తన ప్రసంగం ద్వారా పేర్కొన్నారు. ఆందోళనకరమైన యూదు వ్యతిరేకతను, గాజాలో విచారకరమైన పరిస్థితిని ఆయన తన ప్రసంగం ద్వారా ఖండించారు. కాగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భారత పర్యటనకు ముందు పోప్ ఫ్రాన్సిస్ ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ఆశీస్సులు తీసుకున్న మరునాడే పోప్ మరణించడం ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి.








