Mahaa Daily Exclusive

  వెంకటాపురంలో 29 ఏళ్ల యువకుడు అదృశ్యం…!

Share

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నివసించే 29 ఏళ్ల సాయి ప్రకాష్ అనే యువకుడు గత వారం రోజులుగా అదృశ్యమయ్యాడు. మంగళవారం సాయంత్రం హనుమకొండ హాస్పిటల్ కి వెళ్లిన సాయి ప్రకాష్ తిరిగి ఇంటికి రాలేదని బుధవారం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నాలుగు రోజులు అయినా హనుమకొండ వచ్చిన సాయి ప్రకాష్ హనుమకొండలో ఎటువైపు వెళ్ళాడు ఎక్కడ ఉన్నడు విషయం ఇంతవరకు తెలియదు. తెలంగాణలో రెండో స్మార్ట్ సిటీగా పేరుగాంచిన వరంగల్ సిటీలో జరిగిన ఈ మిస్సింగ్ కేస్ ఇంతవరకు పోలీసులు హనుమకొండ నుండి ఎటైనా వెళ్లాడా లేదా హనుమకొండ లోనే అతని బంధించారా అనే విషయం తెలియకపోవడం పట్ల పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ లు చెక్ చేసిన సరైన సమాచారం అందలేదు అందులో కొన్ని కెమెరాలు పని చేయట్లేదు మొబైల్ నెంబర్ ట్రాక్ చేయగా ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లు లోకేషన్ చూపిస్తున్నట్లు పోలీస్ వారు తెలియజేశారు. వారం రోజులు గడుస్తున్నా ఇంకా ఇటువంటి ఆచూకీ తెలియకపోవడంపై వెంకటాపురం మండలం యువకులందరూ పోలీస్ వారిపై మండిపడుతున్నారు. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి రక్తం అందించి పోలీసు వారితో కూడా సహితంగా ఉన్న సాయి ప్రకాష్ ఇప్పుడు కనపడని పరిస్థితుల్లో ఉంటే పోలీసు వారు స్పందించకపోవడంతో యువత ఇప్పటికైనా పోలీసు వారు ఏం జరిగింది అన్న విషయం పై తొందరగా దర్యాప్తు చేయాలని వెంకటాపురం మండలం యూత్ మీడియాకు తెలియజేశారు. హనుమకొండ నుండి ఎటువైపు వెళ్ళాడు అన్న విషయం ఇంతవరకు తెలియలేదు తనని ఎవరన్నా కిడ్నాప్ చేశారా లేదా తనే ఎక్కడికన్నా వెళ్ళాడా అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.