Mahaa Daily Exclusive

  రెండు దేశాల మధ్యవర్తిత్వానికి తాము సిద్ధం: ఇరాన్

Share

పహల్గామ్ దాడి అనంతరం భారత్– పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి స్పందించారు. భారత్, పాక్ మాకు సోదర దేశాలుగా అభివర్ణించారు. ఈ కఠినమైన సమయంలో రెండు దేశాల మధ్య చర్చలకు వేదిక కల్పించేందుకు టెహ్రాన్ సిద్ధంగా ఉందని, శాంతి, స్థిరత్వం కోసం తాము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు X ద్వారా తెలిపారు. కాగా భారత్ ఇప్పటికే పాక్‌కు సింధు జలాలను సైతం నిలిపివేసిన సంగతి తెలిసిందే.