Mahaa Daily Exclusive

  భారత్‌కి వ్యతిరేకంగా పాకిస్తాన్ పార్లమెంట్‌లో తీర్మానం..!

Share

పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఎగువ సభ అయిన సెనెట్ భారత్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించింది. ఉప ప్రధాని ఇషాక్ దార్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు లభించింది. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న నిర్ణయాన్ని కూడా ఈ తీర్మానం “యుద్ధ చర్య”గా పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడిని తమ దేశంతో ముడిపెట్టడాన్ని ఖండిస్తూ, ఇది రాజకీయ ప్రయోజనాల కోసం భారతదేశం చేసే కుట్ర అని ఆరోపించింది.