మణుగూరు, మహా ; మణుగూరు ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో రేషన్ కార్డు లబ్ధిదారుడికి నూతన రేషన్ కార్డును మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్ అందజేశారు.ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతు పదేళ్ల నుండి నిరుపేద కుటుంబాలు ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డు కలను నెరవేర్చినది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దమ్మున్న నాయకుడు అన్నారు.పది సంవత్సరాలు తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా రేషన్ కార్డు అందజేయని ఘనత ఆనాటి బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కెసిఆర్ ది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద మరియు మహిళా ప్రభుత్వం అని మరోసారి నిరూపించినందుకు ముఖ్యమంత్రి కి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు గాండ్ల సురేష్, మైనార్టీనాయకులు ఎండి రహీంపాషా,నాయకులు ,అప్పన నరేష్ పాల్గొన్నారు.








