ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేపట్టిన ఈ దాడిని దేశ శాంతి భద్రతలను భంగ పరిచే చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు.ఈ దాడికి మతాలు, రాజకీయాలు, లేదా ఏ ఇతర భేదాలను పైకి తీసుకోకుండా, దేశవ్యాప్తంగా అందరు ఐక్యంగా పోరాడాలని పాయం అన్నారు.
ఈ దాడిలో మరణించిన బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, బాధితులకు తగిన న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దారుణ దాడికి తగిన శిక్షలు కల్పించేందుకు సంబంధిత అధికారులపై ఒత్తిడి పెంచాలని సూచించారు పార్టీల నాయకులు కార్యకర్తలు కలసి కొవ్వొత్తు లతో నిరసన తెలిపి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గంపూడి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, యువజన నాయకులు,కార్యకర్తలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.








