నేలకొండపల్లి, ఏప్రిల్ 29 మహా:
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలం లోని సుర్దేపల్లి లో మంగళవారం జరిగిన భూ భారతి చట్టం పై అవగాహాన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏ పని చేసినా ప్రజలకు ఉపయోగపడాలని చేస్తుందని అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం ఒక జీవో తీసుకొస్తే ప్రజల సమస్యలు తీర్చేది గా ఉండాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో హాడావుడి గా తన కుటుంబానికి దోచిపెట్టాలని అరరహితంగా ధరణి ని తీసుకొచ్చారని అన్నారు. ధరణి 2020 చట్టం ఫలితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిందని అన్నారు. 18 రాష్ట్రాలలో రెవిన్యూ చట్టాలను పరిశీలించి భూ భారతి చట్టం తీసుకొచ్చామని అన్నారు. 2025 భూ భారతి చట్టం తీసుకొచ్చి ప్రజలకు అంకితం చేశామని అన్నారు. గత బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి చట్టం లో విధి విధానాలు లేవన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేసిన భూ భారతి చట్టం లో అన్ని విధి విధానాలు అమలు చేశామని అన్నారు. నేలకొండపల్లి మండలం లోని 2300 అప్లికేషన్ లు వచ్చాయని తెలిపారు. ప్రతీ జిల్లాలో 40 శాతం సాదా జైనామా అంశాలే పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో 9 లక్షల 26 వేల మంది సాదా బైనామా కి అప్లికేషన్ లు పెట్టుకున్నారని అన్నారు. అసలు ధరణి లో సాదా బైనామా ఊసేలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చూసి దుఖం అగడం లేదని కేసీఆర్ చెపుతున్నారని.. ఎందుకు ఉద్యోగం పీకారని…లేక పేద వారు సన్న బియ్యం తింటున్నారనా…భూమి సమస్యలు పరిష్కరమవుతున్నాయని కడుపు మండుతుందా అన్నారు. అనాటి ప్రభుత్వం లో మంత్రులను కూడ కలిసే పరిస్థితి లేదని అన్నారు. ధనిక రాష్ట్రం ను అప్పుల పాలు చేస్తే…అప్పులు తీర్చుకుంటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. అనాడు ధరణి ఉన్నప్పుడు భూమి ఉన్న ప్రతీ అసామి భయానికి గురయ్యేవారని అన్నారు. ఇప్పుడు భూ భారతి చట్టంలో రైతుల అన్ని సమస్యలు పరిష్కారం లభిస్తుందని అన్నారు. అనాడు ఇందిరాగాంధీ పేదలకు “భూముల పంపిణీ చేసిందని అన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక’. చేసిన నాలుగు మండలాల్లో రేపటికి రెవిన్యూ సదస్సులు పూర్తవుతాయని అన్నారు. భూ వివాద రహిత మండలాలు గా ఈ నాలుగు మండలాలు ఉంటాయని అన్నారు. మే 5 నుంచి రాష్ట్రంలో మిగతా జిల్లాలో ఒక్కో మండలం ను పైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకుంటామని అన్నారు. జూన్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ రెవిన్యూ గ్రామం కు అధికారులు వస్తారని అన్నారు. ఆగస్టు 15 లోపు మొదటి పేస్ లో రెవిన్యూ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 15 రోజులలో నాలుగు వేల మంది సర్వేయర్ లను తీసుకుని ప్రతీ మండలానికి ఐదుగురు నునియమిస్తామని అన్నారు. కాంట్రాక్టు సర్వేయర్ లతో పాటు 1000 మంది ప్రభుత్వం సర్వేయర్ లను తీసుకుంటామని అన్నారు. 23 వేల మంది రెవిన్యూ సిబ్బంది ని రోడ్డు న పడేశారని అన్నారు. భూ భారతి చట్టం లో అనేక కొత్త కార్యక్రమాలు తీసకొచ్చినట్లు తెలిపారు. వేరే రాష్ట్రంలో చట్టం అమలు చేయాలన్న మన భూ భారతి చట్టం చూసి అమలు చేస్తారని అన్నారు. జూన్ 2 నుంచి యువత కు రాజీవ్ యువ వికాసం పధకం అమలు చేస్తామని అన్నారు. అంతకు ముందు నాచేపల్లి లో రహదారి నిర్మాణం కు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ముజిమ్మిలాఖాన్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు. శాఖమూరి రమేష్, వజ్జా రమ్య, వెంకన్న, గరిడేపల్లి రామారావు, బచ్చలకూరి నాగరాజు, భద్రయ్య, . బోయిన వేణు, చెరువు స్వర్ణ, కడియాల నరేష్ తదితరులు పాల్గొన్నారు








