Mahaa Daily Exclusive

  నారీశక్తి అవార్డు స్వీకరించిన సత్యకుమారి…!

Share

విశాఖ,మహా : విశాఖ నగరానికి కి చెందిన సామాజిక సేవకురాలు యూ.సత్యకుమారికి ఎంతో ప్రతిష్టాత్మకమైన నారీశక్తి అవార్డు-2025 లభించింది.ఈ అవార్డును దూప్రా దర్శక్ ఫౌండేషన్ న్యూఢిల్లీ వారు ఆమె నగరంలోని ప్రజలకు, విద్యార్థులకు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఉమెన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ కేటగిరిలో ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డును సత్యకుమారికి అందజేశారు.ఈ అవార్డును ప్రముఖ నటి సుధా చంద్రంజీ, మిసెస్ ఇండియా మంజిరి చేతుల మీదగా స్వీకరించారు. ప్రస్తుతం ఆమె నగరంలోని 14 ఏళ్లూగా బీపీవోగా విధులు నిర్వహిస్తూ,అటు విధి నిర్వహణ, కుటుంబాన్ని పైతం ఏకధాటిపై చూసుకుంటూ. నగరంలోని పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.ముఖ్యంగా సమాజంలో మహిళా ప్రాధాన్యత, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై పాఠశాల,కళాశాల స్థాయి నుంచి విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.అదే విధంగా విద్యార్థులకు ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ అవేర్నెస్ వంటి వాటిపై కూడా శిక్షణ అందిస్తున్నారు. ఎంతో అత్యున్నతమైన నారీశక్తి అవార్డును స్వీకరించిన సత్యకుమారికి తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.