Mahaa Daily Exclusive

  మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తాళం…!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
అద్దె చెల్లించలేదనే కారణంతో మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తాళం వేశారు. ఇబ్రహీంపట్నం మండలం, మంగళపల్లి పరిధిలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాల కొనసాగుతోంది. సోమవారం క్లాసులు ముగిసిన అనంతరం యజమానులు గదులకు తాళం వేశారు. ఈ విషయాన్ని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో మంగళవారం తాళాలు తెరుచుకున్నాయి. కాగా, విద్యార్థులు రెండు గంటల పాటు బయటే కూర్చోవడం గమనార్హం.