ఆదిలాబాద్ : ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రజాస్వామ్య సుపరిపాలన పురస్కారం అందుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క సన్మానించారు.బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి గుస్సాడి టోపీని బహుకరించి, సత్కరించారు. జిల్లా ఖ్యాతి దేశమంతా వ్యాప్తి చెందేలా కృషిచేశారని కలెక్టర్ పనితీరును కొనియాడారు.సుగుణక్క వెంట సమక్క మహారాజ్ కోరేంగ యశ్వంత్ రావ్, పటేల్ పెందోర్, భగవంత్,జంగు బాయి దేవస్థానం కఠోడల్ HK రాము,ధర్మ రావ్, వెంకటేశ్వర్, జ్ఞానేశ్వర్, విఠల్,విజయ్, అతిష్ తదితరులు ఉన్నారు.
Post Views: 21








