తొర్రూర్ ,మహా:
తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోందని పాలకుర్తి నియోజక వర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా తొర్రూరు పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద చెరువు కట్ట నిర్మాణ పనులను తొర్రూరు మున్సిపల్ అధికారులు పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
అనంతరం జేసీబీ యంత్రం ఎక్కి స్వయంగా స్టీరింగ్ తిప్పి నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ తొర్రూరు పట్టణానికి ఇది ఒక చారిత్రాత్మక రోజని ప్రజల దీర్ఘకాల వాంఛను నెరవేర్చడం నా వ్యక్తిగత గర్వంగా భావిస్తున్నానని,ఈ చెరువు కట్ట నిర్మాణం పూర్తి అయితే పట్టణానికి వరదల సమస్య తొలగిపోవడమే కాక,భూగర్భ జలాల స్థాయి పెరగడం,పర్యావరణం రక్షించబడడం,అలాగే అందమైన సుందర ప్రాంతంగా మారడం జరుగుతుందని ప్రభుత్వం ప్రజల అభ్యున్నతిని ప్రధాన లక్ష్యంగా తీసుకొని ముందుకు సాగుతోందని,ప్రతి సమస్యపై దృష్టి పెట్టి,అభివృద్ధి పనులు నిబద్ధతతో కొనసాగిస్తున్నామన్నారు.తొర్రూరు పట్టణ అభివృద్ధిలో చెరువు కట్ట నిర్మాణం పూర్తయ్యాక తొర్రూరు పట్టణం అందానికి కొత్త ఒరవడి చేరనుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,పార్టీ శ్రేణులు,మున్సిపల్ అధికారులు,యువజన నాయకులు,మహిళ నాయకులు,పట్టణ ప్రజలు,తదితరులున్నారు.








