వెంకటాపురం మహా:
వెంకటాపురం పోలీసు స్టేషన్ పరిధిలో నలుగురు వ్యక్తులు పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ సాయంతో కనుగొని బుధవారం బాధితులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటాపురo గ్రామానికి చెందిన నాగమణి,సతీష్, శశి కుమార్, ముకుందరావు సెల్‌ఫోన్లు పోగొట్టుకున్నారు. దీంతో బాధితులు వెంకటాపురం పోలీసులకు ఫిర్యాదు చేసి సీఈఐఆర్ పోర్టల్‌లో దరఖాస్తు చేశారు. సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని పోలీసులు బాధితులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా తమ సెల్‌ఫోన్ పోగొట్టుకున్నా.. చోరీకి గురైనా సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను పొందుపరుచాలని సూచించారు.
Post Views: 17








