కూసుమంచి, ఏప్రిల్ 30, మహా:
పదో తరగతి ఫలితాల్లో కూసుమంచి మండల కేంద్రంలోని గ్లోబల్ రెయిన్ స్కూల్ ప్రభంజనం సృష్టించింది. అత్యధిక మార్కులతో డివిజన్ లో ప్రథమ స్థానం, జిల్లాలో రెండో స్థానం నిలిచి సత్తా చాటింది. మా మాటలతో కాదు… మా ఫలితాలే మాకు నిదర్శనం అంటూ.. నిబద్దత, ప్రణాళికలతో సాధించే ఫలితాలే నిలువుటద్దం అంటూ విజయదుందుభి మోగించింది. బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో కూసుమంచి మండల కేంద్రంలోని గ్లోబల్ రెయిన్ స్కూల్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణులైనారు. వాచేపల్లి భువన శ్రీకి(గట్టుసింగారం) 584 మార్కులు సాధించి ఖమ్మం జిల్లాలోనే రెండవ ర్యాంక్ సాధించింది. అంతే కాకుండా పాలేరు డివిజన్ లో మొదటి ర్యాంక్ సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకూ మంచి పేరు తెచ్చింది.. అలాగే చింతలపాటి శ్రీజ 556(జీళ్ళచెరువు), వీ శిరీష 543(గట్టసింగారం), గార్లపాటి శివాణి 541(చౌటపల్లి), ఎండీ అస్మ షాగుప్త530(కూసుమంచి), ఎం కీర్తి 525(పోచారం), వీ చత్రపతి 523(కొత్త తండా),బీ శ్యామ్ 515(చేగొమ్మ), పీ ఉదయ్ 501(మంగళితండా) మార్కులు సాధించారు. 9మంది విద్యార్థులు 500మందికి పైగా మార్కులు సాధించారు.
14ఏళ్ళుగా నూరు శాతం ఫలితాలు…
కూసుమంచి మండల కేంద్రంలో 2011 సంవత్సరంలో గ్లోబల్,రెయిన్ బో స్కూల్ ను స్థాపించన దగ్గర నుంచి ఇప్పటి వరకు పదోతరగతి పరీక్షల ఫలితాల్లో ఓటమి అంటూ తెలియదు. 14సంవత్సరాలుగా ప్రతి ఏడాది నూరు శాతం ఫలితాలు వస్తున్నాయి.
సంబారాలు చేసిన స్కూల్ యాజమాన్యం..
పది ఫలితాల్లో అద్భుతమైన రిజల్ట్ వచ్చినందుకు గారహను పాఠశాలలో కరస్పాండెంట్ ఎండీ ఇర్షాద్ ఆధ్వర్యంలో బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కరస్పాడెంట్ మహ్మద్ ఎర్షాద్ అహ్మద్ మాట్లాడుతూ పాఠశాల స్థాపించిన దగ్గరనుంచి విజయాల పరంపర కొనసాగుతుందన్నారు. ఈ ఘనత సాధించడానికి కారణం విద్యా ప్రణాళిక,ఉత్తమ ఉపాధ్యాయ బృందమన్నారు. విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.








