కరీంనగర్, మహా:
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత విస్తృత స్థాయి సమావేశం లో RTA మెంబర్ పడాల రాహుల్ గౌడ్ ప్రవర్తించిన తీరు పార్టీ కి నష్టం కలిగించేలా ఉందని, ఇది పార్టీ క్రమశిక్షణ నియమాలకి విరుద్ధంగా ఉందని వెంటనే పడాల రాహుల్ ను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని యువజన కాంగ్రెస్ కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడు గట్టు ప్రశాంత్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ మొన్నటి సమావేశంలో కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్ గారు తన ఆవేదనని మరియు కార్యకర్తల్లో ఉన్న బాధని వేదిక మీద జిల్లా ఇంచార్జ్ ల ముందు చెప్పుకుంటుంటే… రాహుల్ అనవసరంగా కల్పించుకొని పురుమల్ల శ్రీనివాస్ మీదకి దూసుకు పోతూ ఉద్దేశ్యపూర్వకంగా కార్యక్రమాన్ని రచ్చ రచ్చ చేశాడని దీని వల్ల పార్టీ ప్రతిష్ట బజారుకు వచ్చినదని అధిష్టానానికి తెలిపారు.
రాహుల్ గతంలో NSUI లో పని చేసినపుడు డబ్బులు వసూల్ చేసి సస్పెండ్ అయ్యాడని గుర్తు చేస్తున్నామన్నారు. ఇప్పుడు కూడా యువజన కాంగ్రెస్ ని వర్గాలుగా విడగొట్టి ఆర్గనైజేషన్ ని బ్రస్టు పట్టిస్తున్నాడని అన్నారు. Rta మెంబర్ అయ్యాక అతను చేస్తున్న ప్రతి వసూల్ మీద పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయన్నారు. రాహుల్ వైఖరి మొదటి నుండి పార్టీ లో వివాదాస్పదంగానే ఉందని పార్టీ పెద్దలకి విజ్ఞప్తి చేశారు. అతని దృష్టీ పార్టీ కార్యక్రమాల మీద కన్నా… వ్యక్తుల మీద వ్యక్తిగత కార్యక్రమాలకు ఆసక్తి చూపుతాడని కొత్తగా వచ్చిన యువజన కాంగ్రెస్ నాయకత్వాన్ని తప్పు దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. తొందరలో పార్టీ పెద్దలను కలిసి ఆధారాలతో సహా పిర్యాదు చేస్తామని అన్నారు.








