కూసుమంచి, మే 15, మహా:
మృతుల కుటుంబాలకు అర్థిక చేయూతను అందించేందుకు గౌరవ రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “పొంగులేటి ఆత్మీయ భరోసా” ను కూసుమంచి మండలంలోని 9 గ్రామాల్లో 11 కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం అందజేశారు. ఇటీవలే పలు కారణాలతో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకునేందుకు గాను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతి కుటుంబానికి రూ.10వేల చొప్పున అర్థిక సహాయం చేస్తానని ప్రకటించగా, ఆ తరరువాత నుంచి మొత్తం 11 మంది మృతి చెందారు. మండలంలోనాయకన్ గూడెం -3, పెరికసింగారం-1, కొత్తూరు -1, నర్సింహులు గూడెం -1, లాల్ సింగ్ తండా-1, గైగొళ్ళపల్లి-1, బోడియాతండా-1, కూసుమంచి -1, లోక్యతండా -1మొత్తం9 గ్రామాల్లో 11 కుటుంబాలకు కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కూసుమంచి క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండగా నిలుస్తారని అన్నారు. చనిపోయిన వ్యక్తులకు ప్రగాడ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, మండల పార్టీ అధ్యక్షుడు మట్టె గురవయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సెట్రామ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బజ్జూరి వెంకట్ రెడ్డి, మహ్మద్ హాఫీజుద్దిన్, పెండ్ర అంజయ్య, చాట్ల పరుశురాం, మారోజు భీష్మాచారి, కంచర్ల వీరారెడ్డి, చెన్నా మోహన్, భారీ వీరభద్రం, ఎండీ.అహ్మద్ అలీ, జనార్థన్ గౌడ్, కొండా మహిపాల్, శేఖర్ రెడ్డి, రఫీ, మల్సూరు, కోటేశ్వరరావు, ధరావత్ వెంకట్, లక్ష్మారెడ్డి, అంజిరెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు బయ్యా వినయ్, లింగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.







