Mahaa Daily Exclusive

  వైరా హైవే పై మంత్రి తుమ్మల తనిఖీ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను పర్యవేక్షన. సూర్యాపేట–దేవరపల్లి రహదారిపై సమీక్ష…!

Share

వైరా – మహా.
తెలంగాణ రాష్ట్రానికి మౌలిక వసతుల వికాసంలో మద్దతుగా నిర్మించబడుతున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతతో పర్యవేక్షణ చేపట్టింది. సూర్యాపేట నుండి దేవరపల్లి వరకు సాగనున్న ఈ ప్రాజెక్టు నేడు కీలక దశలో ప్రవేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వైరా నియోజకవర్గ పరిధిలోని హైవే పనులను స్వయంగా పరిశీలించారు. ఈ పరిశీలన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. ఈ హైవే పూర్తైతే ఖమ్మం-రాజమండ్రి మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనున్నదే కాకుండా, అభివృద్ధికి సరికొత్త దిక్సూచి అవుతుంది.

సూర్యాపేట నుండి దేవరపల్లి వరకు నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వైరా నియోజకవర్గంలోని సిరిపురం గ్రామ వద్ద చేరుకున్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేకంగా వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ మంత్రి గారికి పుష్పగుచ్ఛాలతో ఆహ్వానం పలికారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ – ‘‘గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం పూర్తి కాకపోతే ఈ ప్రాంతానికి అభివృద్ధి రాదు. రైతులకు మార్కెట్ లకు చేరువ, యువతకు ఉద్యోగావకాశాలు, పారిశ్రామిక వికాసం ఇవన్నీ ఈ రహదారి ద్వారానే సాధ్యం’’ అని తెలిపారు. హైవే నిర్మాణం వేగవంతం కావాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా ఓబీసీ కాంగ్రెస్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, వైర మండల పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, పిసిసి మెంబర్ వడ్డే నారాయణరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, మార్క్ ఫైడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజా, వైర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పమ్మి అశోక్, మచ్చ బుజ్జి, మట్టూరి నాగేశ్వరరావు, ధర్నా రాజశేఖర్, జవ్వాజి నాగరాజు, తెల్లూరి వీరయ్య, చింతనిప్పు మాధవరావు, రావూరి అజయ్ తదితరులు పాల్గొన్నారు.