Mahaa Daily Exclusive

  జిల్లా మహిళా సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, మే 15 (మహా ):
భద్రాద్రి జిల్లా మహిళా సమాఖ్య పాలకవర్గ ఎన్నికలను గురువారం నిర్వహించారు. గత జిల్లా సమాఖ్య పదాదికారులుగా యస్.ఉషారాణి. అధ్యక్షురాలు , వి.నాగమణి కార్యదర్శి,వి.మమత కోశాదికారి వారు పదవీ విరమణ పొందారు.
నూతన జిల్లా సమాఖ్య పదాధికారులుగా యస్.సుజాత అధ్యక్షులు,కె.సునిత కార్యదర్శి,కె.సౌజన్య కోశాధికారి గా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి డి.ఆర్.డి.ఓ. హాజరై కొత్తగా ఎన్నికైన పదాదికారులకు అభినందనలు తెలియజేసారు. మన జిల్లా బ్యాంక్ లింకేజ్ లో రాష్ట్రంలో మొదటి స్తానంలో వుందని ఎన్ పి ఎను కూడా తగ్గించటం జరిగిందని, ఈ విషయమై గ్రామీణాభివృద్ధి శాఖామంత్రులు సీతక్క మరియు సెర్ప్ సి.ఈ.ఓ. ద్వారా జిల్లా కు అవార్డ్ రావటం జరిగిందని తెలియజేసారు. సమావేశానికి పి.యం.ఐ.బి.సెర్ప్ వసంత సేన, అదనపు డి.ఆర్.డి.ఓ. మరియు డి.పి.యం.లు మండల సమాఖ్య అధ్యక్షులు హాజరయ్యారు.