Mahaa Daily Exclusive

  మే 20 దేశ వ్యాప్తసమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పాల్గొనాలి – సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్ పిలుపు..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, మే 15 (మహా):
మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్న శ్రామిక వర్గం అంతా మే 20న జరుగుతున్న దేశవ్యాప్త సమయంలో పాల్గొని జయప్రదం చేయాలని భూక్య రమేష్ పిలుపునిచ్చారు. కొత్తగూడెం పట్టణంలో ఆటో కార్మికుల వద్ద ,కార్ డ్రైవర్ కార్మికుల వద్ద, ఆర్టీసీ కార్మికుల వద్ద, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అన్ని అడ్డాల వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గ్రూప్ మీటింగ్స్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లలో భూక్య రమేష్ మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు అన్యాయం చేసే విధంగా ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా సంపాదించిన సంపాదన మొత్తం టాక్స్ లకే కట్టే విధంగా ఉన్నటువంటి చట్టాలన్నీ రద్దుచేసి ట్రాన్స్పోర్ట్ కార్మికులకు న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు టాక్సీల పేరుతో ఇన్సూరెన్స్ ల పేరుతో ఫైనాన్స్ పేరుతో… ఆర్థిక సమస్యలతో ఇప్పటికే సతమవుతమవుతున్న ట్రాన్స్పోర్ట్ కార్మికులందరికీ ప్రభుత్వమే ప్రత్యేకమైన పథకం ద్వారా “సహకార్ ” ఏర్పాటుచేసి ఈ యాప్ ద్వారా ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కిరాయిలు అందేలాగా ప్రజలకు అనుసంధానం చేస్తూ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రమాదవశాత్తు మరణించిన ప్రతి కార్మికులకు ట్రాన్స్పోర్ట్ కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు కోరారు కార్మిక చట్టాల ప్రకారం సహాయం అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని ఆయన తెలిపారు అటువంటి బాధ్యతను తప్పుకొని నాలుగు లేబర్ కోడ్ ల ను తీసుకువచ్చి ట్రాన్స్పోర్ట్ కార్మికులకు అన్యాయం చేసే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టేలా మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె జరగబోతుందని భారతదేశ వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం ట్రాన్స్పోర్ట్ కార్మికులందరూ ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు నాలుగు లేబర్ కోళ్లు రద్దు అయ్యే వరకు కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉద్యమించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ కార్మికులు గణేష్ రవి నరసింహ సైదులు, వీరస్వామి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.