రఘునాథపాలెం, మహా.
జిల్లాలో పలు అభివృద్ధి, నిర్మాణాల పనులకు అవసరమైన ప్రభుత్వ స్ధలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
గురువారం జిల్లా కలెక్టర్, రఘునాథపాలెం మండలంలో పర్యటించారు. ప్రభుత్వం చేపట్టే నూతన నిర్మాణాలకు స్థల సేకరణ కోసం పలు ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. టిటిడి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కోసం పువ్వాడ ఉదయ్ నగర్ గుట్ట పైకి ఎక్కి అనువైన స్ధలం, రహదారికి మార్గాలను అధికారులతో కలిసి క్షేతస్థాయిలో పరిశీలించారు. జింకలతండా, పువ్వాడ ఉదయ్ నగర్ ల పూర్తిస్థాయి స్ధలాల మ్యాప్ లను సిద్దంచేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట రఘునాథపాలెం తహసీల్దార్ లూథర్ విల్సన్, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.
Post Views: 28








