వరంగల్ మహా;
అందాల పోటీలో పాల్గొంటున్న ప్రపంచ సుందరిమణుల పర్యటన కోసం ప్రజా ధనాన్ని వృధా చేస్తూ పేద ప్రజల పొట్ట గొడుతున్నారని,ఈ సందర్భంగా చిరు వ్యాపారుల సముదాయాలను కూల్చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు.
గురువారం వరంగల్ నగరం ఓ సిటీ లోని ఎర్రబెల్లి ప్రదీప్ రావు క్యాంపు కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ
ఈటల రాజేందర్ ప్రజల చేత 7 సార్లు ఎన్నుకోబడి జనం మెచ్చిన నాయకుడిగా గుర్తింపు పొంది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిని అక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక జగ్గారెడ్డి అనే పేడ్ ఆర్టిస్ట్ ఊరు కుక్కల పదవి కోసం విచ్చలవిడిగా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు, జగ్గారెడ్డి నీకు ఏమైనా బుద్ధి ఉందా? టీపీసీసీ పదవి కోసం రేవంత్ రెడ్డి ని ఎన్ని మాటలు అన్నావో నీకు గుర్తుందా? అదే ఇప్పుడు పదవి కోసం రేవంత్ రెడ్డి మెప్పుకోసం ఇలాంటి వ్యాఖ్యలు మా నాయకుడి పై చేస్తే బిజెపి కార్యకర్తలు, నాయకులు, నిన్ను బయట కూడా తిరుగనీయకుండా చేస్తారని జగ్గారెడ్డి ఖబర్దార్ అని హెచ్చరించారు.
అసలే దేశమంతా యుద్ధ వైపు చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రపంచ సుందరి మణులకు కోసం ప్రజాధనంతో ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యంగా ప్రపంచ సుందరీమణులు జిల్లా పర్యటన కోసం వస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చిరు వ్యాపారస్తుల వ్యాపార సముదాయాలను కాంగ్రెస్ పార్టీ ధ్వంసం చేసి వారి పొట్ట గొడుతూ వారి ఉపాధిని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ, వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఇలాంటి పనులను ప్రోత్సహించరాదని, ఇంత జరిగినా స్థానిక మంత్రి పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తూ పేద ప్రజలకు అన్యాయం జరిగిన ఏ మంత్రం చలనం లేకుండా నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా మంత్రి పదవిని కాపాడుకుంటూ, పోలీస్ బలగాలని ఉపయోగించుకుంటూ వారి సొంత పనులకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేసిన పేద ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మాజీ మేయర్ డాక్టర్ రాజేశ్వరరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్, మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు, ఆరూరి రమేష్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, బిజెపి సీనియర్ నాయకులు కొరబోయిన రాజ యాదవ్, మంద ఐలయ్య , నరహరి వేణుగోపాల్ రెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, కాళీ ప్రసాద్, కుసుమ సతీష్, డాక్టర్ వన్నాల వెంకటరమణ, రత్నం సతీష్ షా, మల్లాడి తిరుపతి రెడ్డి, తాబేటి వెంకట్ గౌడ్, బిజెపి సీనియర్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.








