Mahaa Daily Exclusive

  సంస్కృతి పేరుతో విదేశీయుల కాళ్ళు కడిగించడం సిగ్గుచేటు వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్..!

Share

వరంగల్ మహా;

ఇది తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి జరిగిన ఘోరమైన అవమానం అని
తెలంగాణ మహిళలతో ప్రపంచ సుందరీమణుల కాళ్ళు కడిగించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పై వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
కొండా సురేఖ, సీతక్క స్థానిక మంత్రులుగా ఉన్న ఓరుగల్లులో విదేశీ మహిళల కాళ్లు కడిగిన తర్వాత టవల్స్‌తో వారి కాళ్ళు తుడిపించడం తెలంగాణ పరువు తీసిన కాంగ్రెస్ ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
రాణి రుద్రమదేవి, సమ్మక్క సారక్కలు, చాకలి ఐలమ్మ లాంటి వీరవనితలు పుట్టిన నేల ఓరుగల్లు అని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలతో పాటు, దేశంలోని మహిళ లోకాన్ని ప్రపంచం ముందు అవమానపరిచింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందని
తెలంగాణ ఆడపడుచులతో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించడం తూవ్వాలతో తుడిపించడం అవమానకరమైన దుర్మార్గమైన అత్యంత హేయమైన చర్య అని యావత్ తెలంగాణ మహిళా లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తామని తమ కాళ్ళ మీద తాము నిలబడేలా మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతామని గొప్పగా చెప్పే ప్రభుత్వం విదేశీయుల కాళ్లు కడిగించడం ద్వారా ఈ సమాజానికి ఏటువంటి సంకేతాలు ఇచ్చారని
దీనిని యావత్తు సమాజం ఖండిస్తుందని అన్నారు.