వరంగల్ మహా;
వరంగల్ నగరంలోని 27 వ డివిజన్ కృష్ణ కాలనీ లో సి ఎస్ ఆర్ నిధుల తో (అరవిందో ఫార్మా కంపెనీ వారి సహకారం తో) రూ.5 కోట్ల అంచనా వ్యయం తో నిర్మించనున్న కృష్ణ ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలికల) నూతన భవనానికి కృష్ణ కాలనీలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ ఉత్తమ శ్రేణి విద్యార్థులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, కార్పొరేటర్లు చింతాకుల అనిల్ కుమార్, కావేటి కవిత, బస్వరాజు కుమారస్వామి, సురేష్ జోషి, అరబిందో ఫార్మా డైరెక్టర్ సదానంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం
ఉర్సు గుట్ట సమీపం లోని నాని గార్డెన్స్ లో గురువారం ఓరుగల్లు శివ శక్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన చౌదరి బిరుదాంకిత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ హాజరై శివ శక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. తదనంతరం శివ శక్తులకు చౌదరి బిరుదాంకిత సన్మాన పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రాన్స్ జెండర్ల సంఘం అధ్యక్షురాలు లైలా శివ సత్తులు, కార్పొరేటర్లు, తదితరులు, పాల్గొన్నారు.








