Mahaa Daily Exclusive

  వర్షాకాలానికి ముందే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య.!

Share

హన్మకొండ మహా;

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతంగా వర్షాలు పడక ముందే పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గోదాంల వద్ద నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.
ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఇప్పుడు వరకు చేపట్టిన ధాన్యం కొనుగోలు, ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో ఎన్ని మిల్లులు ట్యాగ్ అయి ఉన్నాయి, ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలకు డబ్బులు జమ అవుతున్నాయా, ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఇంకా ఎన్ని గన్నీ బ్యాగులు ఉన్నాయి, ఒక్కో గన్ని బ్యాగుకు ఎంత ధర పడుతుందనే వివరాలను అధికారులు, నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఇదే మండలంలోని వీర నారాయణపూర్ లో తొలి విడత మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ గ్రామానికి చెందిన లబ్ధిదారులు సౌందర్య, సుశీల ఇండ్ల నిర్మాణానికి మెటీరియల్ను ఎక్కడినుండి తీసుకు వస్తున్నారు, ఇప్పటివరకు ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చయిందని, ఎప్పటి వరకు పూర్తి చేస్తారని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒకే రేటు ప్రకారం చేస్తున్నారా లేదా అని లబ్ధిదారులతో మాట్లాడి కలెక్టర్ తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామంలో ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు బేస్ మెంట్ లెవెల్ వచ్చాయని, ఆ దశకు వచ్చిన వాటికి బిల్లు చెల్లింపు కోసం ఆన్లైన్ చేస్తున్నారా, ఈ గ్రామంలో ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయని, ఇంకా మొదలుపెట్టని ఇండ్లను ఎప్పటినుండి ప్రారంభిస్తారని గృహ నిర్మాణ శాఖ డి ఈ సిద్ధార్థ నాయక్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులతోనూ జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
అనంతరం ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, జిల్లాలో ఇప్పటివరకు 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు దాదాపుగా 150 కోట్ల రూపాయలను చెల్లించినట్లు పేర్కొన్నారు. రెండు వారాలలో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా వీరనారాయణపూర్ లో మొదటి దశలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. బేస్మెంట్ లెవెల్ పూర్తిచేసి ఆన్లైన్ అయిన ఇండ్ల నిర్మాణాల లబ్ధిదారులకు బిల్లు చెల్లించడం జరిగిందన్నారు. వివిధ మహిళా వీవో గ్రూపుల ద్వారా లబ్ధిదారులు బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకునే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మిగతావి కూడా త్వరలో ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఇన్చార్జి జిల్లా అదనపు కలెక్టర్ మేన శ్రీను, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమరయ్య, సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, ఎంపీడీవో విజయ్ కుమార్, ఇతర అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.