Mahaa Daily Exclusive

  నేరస్థులను పట్టుకొవడంలో ఫింగర్‌ ప్రింట్‌ విభాగం కీలకం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ..!

Share

హన్మకొండ మహా;

సంఘటన జరిగిన ప్రదేశంలో నేరస్థుల అనవాళ్ళను గుర్తించి వారిని పట్టుకొవడంలో ఫింగర్‌ ప్రింట్‌ విభాగం ఎంతో కీలకంగా పనిచేస్తుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. రాష్ట్ర ఫింగర్‌ ప్రింట్‌ విభాగం మంజూరు చేసిన అత్యాధునిక పరికరాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా స్టేషన్ సిబ్బందికి గురువారం అందజేశారు. దేశంలోనే తోలిసారిగా తెలంగాణ ఫింగర్‌ ప్రింట్‌ విభాగం అధ్వర్యంలో నూతనంగా ఆటోమెటెడ్‌ మల్టీమోడల్‌ ప్రింగర్‌ ప్రింట్‌ ఐడెంటీఫికేషన్‌ సిస్టం పరిజ్ఞానాన్ని వినియోగించుకోని వ్రేలి ముద్రలతో పాటు నిందితులకు సంబందించిన కంటి కనుపాపలు, ముఖాలతో పాటు పాదముద్రలను సేకరించి నూతన పరిజ్ఞానం ద్వారా వీటిని భద్రపర్చడం జరుగుతుంది. ఇందుకొసం ఫింగర్‌ ప్రింట్‌ విభాగం మొదట విడతగా తొమ్మిడి పోలీసు స్టేషన్లకు జారీచేసిన పరికరాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందికి అందజేయడం జరిగింది. ఈ నూతన టెక్నాలజీ వినియోగంపై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఫింగర్‌ ప్రింట్‌ అధికారులు సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేనివిధంగా నూతనంగా అందుబాటులోకి తీసుకవచ్చిన టెక్నాలజీని వినియోగించడంలో అధికారులు, సిబ్బంది నిష్ణాతులు కావాలని, స్టేషన్‌ అధికారులు సేకరించిన సమచారం ద్వారా నిందితులను గుర్తించడం చాలా సులభమవుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ కార్యక్రమములో వరంగల్‌ పోలీస్‌ కమినరేట్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఇన్స్‌స్పెక్టర్లు రాజ్‌కుమార్‌, శ్రీధర్‌, రాజశేఖర్‌ పాల్గోన్నారు.