Mahaa Daily Exclusive

  పార్టీ బ‌లోపేతానికి క‌లిసి ప‌ని చేయండి క‌ష్ట‌ప‌డిన వారికి గుర్తింపు ద‌క్కుతుంది బోథ్ స‌మావేశంలో టీపీసీసీ ప‌రిశీల‌కుల వెల్ల‌డి..!

Share

ఆదిలాబాద్ మ‌హా : పార్టీని న‌మ్ముకుని ప‌ని చేసే కార్య‌క‌ర్త‌ల‌కు కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని ఆదిలాబాద్ జిల్లా ప‌రిశీల‌కులు టీపీసీసీ ఉపాధ్యక్షులు ఉర్దూ అకాడ‌మీ చైర్మ‌న్ తాహెర్ బిన్ హంద‌న్ , టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చిట్ల సత్యనారాయణ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం లో ఇంచార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో వారు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాసరెడ్డితో క‌లిసి పాల్గొన్నారు. సంస్థాగతంగా పార్టీ ని బలోపేతం చేయడం గురించి శ్రేణుల‌కు దిశానిర్దేశం చేసారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పికొడుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి బ‌లంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతీ కార్యకర్త కు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్య‌క్ర‌మంలో డీసీసీబీ చైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి ఏఐసీసీ మెంబర్ నరేష్ జాదవ్,బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, సీనియర్ నాయకులు గొర్ల రాజు యాదవ్, మల్లెపూల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.