Mahaa Daily Exclusive

  ఘనంగా అంజన్ కుమార్ జన్మదిన వేడుకలు..!

Share

కరీంనగర్, మహా:

పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ జన్మదినం సందర్భంగా నేడు నగరంలోని పలుచోట్ల పలువురు కాంగ్రెస్ నేతలు మరియు అంజన్ కుమార్ అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించినారు.

యూత్ కాంగ్రెస్ నాయకులు కొండ్ర హరీష్ ఆధ్వర్యంలో నగరంలోని టవర్ సర్కిల్ వద్ద జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొన్నం సత్యం హాజరై అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొన్నం సత్యంతో పాటు కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇమ్రాన్, కంకణాల అనిల్ కుమార్, మహమ్మద్ అహ్మద్ అలీ, బోనాల శ్రీనివాస్, వీర దేవేందర్ పటేల్, శ్రీపురం మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకులు ఆసిఫ్ ఆధ్వర్యంలో నాకా చౌరస్తా వద్ద కేక్ కట్ చేయడం జరిగింది.

మాజీ కరీంనగర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్ నేతృత్వంలోని అంజన్ కుమార్ అభిమానులు రాజీవ్ చౌక్ వద్ద కేక్ కట్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షునిగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ నేడు పిసిసి కార్యదర్శిగా పార్టీకి సేవలందిస్తున్న వైద్యుల అంజన్ కుమార్ మున్ముందు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని నేటి యువతకు మార్గదర్శకులుగా స్ఫూర్తిదాయకులుగా ఉన్నటువంటి అంజన్ కుమార్ గారు ఇలాంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆశిస్తున్నామని నేతలు పేర్కొన్నారు.