మహా: విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించిన టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో నివాసముంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవల రాంగ్ రూట్లో వస్తుండగా జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. అయితే, బెల్లంకొండ శ్రీనివాస్ కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ మేరకు కానిస్టేబుల్ ఫిర్యాదు చేయగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదయ్యాయి.
Post Views: 22








