Mahaa Daily Exclusive

  హజ్ యాత్ర ప్రతి ముస్లిం కల హజ్ యాత్రికుల బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ..!

Share

మహా: హజ్ పవిత్ర యాత్ర వారి జీవితంలో ఆధ్యాత్మిక శాంతిని, సంతోషాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
శుక్రవారం హజ్ యాత్రకు బయలుదేరే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్ హౌస్‌లో హజ్ యాత్రికుల బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, యాత్రకు జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో ఆయన హజ్ యాత్రికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ రాష్ట్ర ప్రభుత్వం యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా సమన్వయంతో రవాణా, వసతి, వైద్య సహాయం వంటి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. 2025 హజ్ యాత్ర కోసం తెలంగాణ నుంచి సుమారు 4,200 మంది యాత్రికులు ఎంబార్కేషన్ పాయింట్ హైదరాబాద్ ద్వారా సౌదీ అరేబియాకు బయలుదేరుతున్నారు. ఈ యాత్రికులు హైదరాబాద్ నుంచి జెడ్డా, మదీనా విమానాల ద్వారా యాత్రను కొనసాగిస్తారు.