రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మండలం, కొంగరకలాన్ గ్రామంలో నిర్ధాక్షణంగా పేదల పూర్వీకుల సమాధులను కూల్చివేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ. సమాధులు కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కొంగరకలాన్ గ్రామ వాసులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ.. తమ పూర్వికుల సమాధులు ఫిరోజ్గూడ సమీపంలో ఉండేవని, ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వాటిని కూల్చివేసిందని, సదరు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చెరువుకట్ట పైన ఉన్న సమాధులను కూల్చివేసి, నాలను పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. రెవెన్యూ, అధికారులు ఇరిగేషన్ అధికారులు ఈ యొక్క నాలాను కబ్జాకు గురికాకుండా కాపాడాల్సిందిగా కోరారు.
Post Views: 60








