Mahaa Daily Exclusive

  సురవరం ప్రతాప్ రెడ్డి గారి జయంతి వేడుకలను రాష్ట్ర సర్కార్ అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..!

Share

శతాబ్దం క్రితమే తెలంగాణ కోసం నినదించిన మహోన్నత వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి అని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ తెలిపారు . కవిగా , సామాజిక వేత్తగా , రాజకీయ నేతగా ఆయన ప్రఖ్యాతిని పొందరన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారి 129 జయంతి వేడుకలు నేడు రవీంద్ర భారతిలో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
గోల్కొండ పత్రికను స్థాపించి ప్రజలలో చైతన్య కలిగించారని ఆయన వివరించారు. ఆనాడు జోగిపేట ఆంధ్ర మహాసభకు హాజరైన దళితుడు అయిన బాద్యరెడ్డి వర్మను వేదిక మీదకు రానివ్వకుంటే ,అతన్ని వేదికపైకి తీసుకువచ్చి అతనితో ప్రసంగం ఇప్పించిన గొప్ప నేత అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సురవరం ప్రతాప్ రెడ్డి గారికి సముచిత గౌరవం కల్పించి, తెలుగు యూనివర్సిటీకి ప్రతాప్ రెడ్డి గారి పేరుని పెట్టిందన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేల కృషి చేస్తానని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్తానని గుత్తా సుఖేందర్ రెడ్డి
ఈ సందర్భంగా తెలిపారు