హన్మకొండ మహా;
పార్టీలకు అతీతంగా అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థికంగా అండగా నిలుస్తున్నదని
సీఎం ఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు ఓ వరంగా మారిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా గురువారం హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే నివాస క్యాంప్ కార్యాలయంలో హాసన్ పర్తి ప్రాంతానికి చెందిన జీర సదానందం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా వచ్చిన 1,36,000 చెక్కును లబ్ధిదారునికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, జిల్లా కాంగ్రెస్ నాయకులు అనిమిరెడ్డి కృష్ణారెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 32








