రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఫార్మాసిటీ రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్, ఎమ్మెల్యేలు, నేతలు. ఫార్మాసిటీ భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే అభ్యర్థన సబితా ఇంద్రారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ… రైతుల అంగీకారం లేకుండా టిజి ఐఐసి పేరిట ఆన్‌లైన్‌లో నమోదైన భూమిని, వెంటనే తిరిగి రైతుల పేరిట మార్చి, రైతు భరోసా తదితర పథకాలు వర్తింపజేయాలని తెలిపారు. ఫార్మాలో భూములు కోల్పోయిన రైతులకు మొత్తం భూమికి న్యాయమైన పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ *మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీ జైపాల్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహా రెడ్డి, మెరుగు రమేష్, కందుకూరి సాయి, శ్రీధర్ రెడ్డి, హబీబుద్దీన్ తదితరులు రైతులతో ఉన్నారు.








